English | Telugu
ఋతురాగాలు కెమెరామ్యాన్ వెంకట రమణ మృతి!
Updated : Apr 4, 2024
సీనియర్ టీవీ కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో బుధవారం కనుమూశారు.శ్వాస సంబంధ సమస్య తో ఆయన నిమ్స్ లో మంగళవారం చేరారు. ఆయన స్వస్థలం మచిలీపట్నం , ఋతురాగాలు,సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు, మున్నగు ప్రజాదరణ పొందిన పలు సీరియళ్ల కు కెమేరామ్యాన్ గా పనిచేసారు.
ఎస్ వి బి సి ఛానల్ నిర్మించిన “శ్రీ వైనతేయ” ధారావాహికకు 2009 సంవత్సర ఉత్తమ కెమేరామ్యాన్ గా నంది పురస్కారం అందుకున్నారు. పూరి జగన్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలీఫిలిమ్ “జీవితం" కు పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ , ఎడిటర్ కావడం గమనార్హం. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి టివి కెమేరామ్యాన్ ల సంఘం తో పాటు టివి పరిశ్రమ లోని పలువురు సంతాపం తెలిపారు. ఆయన అంత్య క్రియలు మచిలీపట్నం లో జరుగుతాయి.