English | Telugu

ఆలీతో అంత సేఫ్ కాదన్న అంజలి...

"గీతాంజలి" పేరుతో వచ్చిన మూవీలో నటించిన అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇక ఈ ఆలీతో సరదాగా షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈమెతో పాటు కోన వెంకట్ కూడా ఆలీ షోకి వచ్చారు. ‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లే అందించారు. ఈ షోకి వచ్చిన అంజలి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది “ఏంటి అలాంటి ఆయన్ను చేసుకోబోతున్నావంట ? అని ఆలీ అనగానే.. “అగ్ర నిర్మాత” అని అంజలి ఆన్సర్ ఇచ్చింది. “ఈ స్టేజి మీద చేసిన డెకరేషన్ చూస్తుంటే ఏం అనిపిస్తోంది” అనగానే, “ఉగాది సెలబ్రేషన్ లా అనిపిస్తోంది” అని చెప్పింది. “పెళ్లికి చేసే డెకరేషన్ లా అనిపించడం లేదా?” అని ఆలీ అనడంతో అంజలి నవ్వేసింది . ఇక గతంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాతో పోల్చితే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చాలా స్పెషల్ మూవీ ఈ స్టోరీని డెవలప్ చేయడానికి కోన గారికి నాలుగేళ్లు పట్టిందని చెప్పింది.

తర్వాత షోలోకి కోన వెంకట్ ని ఇన్వైట్ చేశారు ఆలీ. "రోజు రోజుకూ పసి కూనలా తయారవుతున్నావు గ్లామర్ రహస్యం ఏమిటి" అని అడిగాడు ఆలీ. "బీ పాజిటివ్, స్టే పాజిటివ్ అనే సూత్రాలను పాటిస్తే అందరూ అందంగానే ఉంటారు" అని చెప్పాడు. "గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీలో కొత్త పాయింట్ ఏంటి ? అని ఆలీ అడగ్గా, దెయ్యాలతో షూటింగ్ చేయడమే ఈ సినిమాలో కొత్త పాయింట్" అని చెప్పారు. " 1000 రూపాయలకు ఎన్ని 50 రూపాయలు వస్తాయి" అని అంజలిని అడిగాడు ఆలీ. 10 అని అని చెప్పింది అంజలి . "నీ రెమ్యునరేషన్ నువ్వే లెక్కబెట్టుకుంటావా ? వేరెవరైనా లెక్కబెడతారా ? అని రివర్స్ లో ఆలీ అడిగేసరికి మేనేజర్ లెక్కబెడతారని చెప్పింది. ఇకపై నీ మేనేజర్ గా నేనుంటాను అని అని అన్నాడు ఆలీ. "నాకు సేఫ్ ఆయనే" అని అంజలి చెప్పడంతో "అంటే నేను సేఫ్ కాదనా" అని వెంటనే అడిగేశాడు ఆలీ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.