English | Telugu

Karthika Deepam2 : నువ్వు నా భర్తవి కాబట్టి సరిపోయింది.. లేదంటే‌ నీ సంగతి చెప్పేదాన్ని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఇది నవ వసంతం.... ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -9 లో... శౌర్యని తీసుకొని దీప హైదరాబాద్ కు వచ్చి.. తన భర్త నరసింహ కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. దార్లో కనిపించిన డ్రైవర్ ని‌ పిలిచి.. డ్రైవర్ నరసింహ తెలుసా అని అడుగుతుంది. అతను డ్రైవర్ యూనియన్ కి ఫోన్ చేసి నరసింహ అనే పేరు గల వాళ్ళ గురించి కనుకొన్ని దీపకు చెప్తాడు.

మరొకవైపు జ్యోత్స్నకి సుమిత్ర టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే దూరంగా ఉండి పారిజాతం వాళ్ళని చూసి.. నా కూతురు నీ మనవరాలు అనుకో అని నీ భర్త అన్నాడు కానీ నువ్వు మాత్రం నా నీడ కూడా తనకి తాకొద్దు అనుకుంటున్నావు. అయిన జ్యోత్స్న నా మనవరాలు.. నా కొడుకు దాసు కూతురని పారిజాతం అనుకుంటుంది.‌ మరొకవైపు దీప నరసింహ కోసం వెతుకుతూనే ఉంటుంది. ఆ తర్వాత సుమిత్ర గుడికి వెళదామని తన భర్తతో అంటుంది. నేను బిజీ అని అతను చెప్పగానే.. నేను వస్తానని పారిజాతం అంటుంది. మీరు ఆఫీస్ కి వెళ్ళండి అని తన భర్తని ఆఫీస్ కు పంపిస్తుంది సుమిత్ర. నేను ఒక్కదాన్ని గుడికి వెళ్తానని పారిజాతానికి సుమిత్ర చెప్తుంది. చెంప దెబ్బకొట్టి నువ్వు వద్దు అన్నట్లు చెప్పావని పారిజాతం అనుకొని.. నీ సంగతి చెప్తానంటు సుమిత్రపై కోపంగా ఉంటుంది.

ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి మేనేజర్ వచ్చి.. మన దగ్గర పని చేసే చెఫ్ చనిపోయాడు కదా అతనికి వెళ్ళాల్సిన డబ్బులు ఇవ్వాలని అనగానే.. ఇవ్వండి, అంతే కాకుండా ఎక్స్ ట్రా కూడా ఇవ్వండి, మన దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించండని కార్తీక్ చెప్తాడు.‌ మరొకవైపు దీప అందరిని నరసింహా గురించి అడుగుతుంటే.. శౌర్య వెళ్లి ఒక ఇంటి దగ్గర పూలు తెంపుతుంది. ఆ ఇంటావిడా శౌర్యని తిడుతుంది. దాంతో శౌర్య భయపడుతూ దీప దగ్గరికి వస్తుంది.శౌర్యని అక్కడే ఉంచి దీప ఆవిడా దగ్గరకి వెళ్లి చిన్నపిల్ల తెలియకుండా చేసిందన్నా కూడా వినకుండా తిడుతుంటుంది. ఎవరి మీద ఆరుస్తున్నావంటూ లోపల నుండి తన భర్త నరసింహా వస్తాడు. అతన్ని చూసిన దీప షాక్ అవుతుంది. అతనే నర్సింహా.. ఆ తర్వాత తను రెండో పెళ్లి చేసుకున్న ఆమెని లోపలికి పంపించి.. దీపతో ఇష్టం లేనట్టు మాట్లాడతాడు. నేను రాను అంటూ దీపకు కోపం వచ్చేలా మాట్లాడతాడు.. నువ్వు నా మొగుడివి కాబట్టి బ్రతికిపోయావ్ లేదంటే నీ సంగతి చెప్పేదాన్ని అని దీప అంటుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.