English | Telugu

Krishna Mukunda Murari : ఇకనుండి మీరానే ముకుంద.. షాకైన ఫ్యామిలీ!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -435 లో... ఉదయాన్నే రజినీ ఇల్లంతా చూస్తూ.. ఈ ఆస్తి నా కూతురు సొంతం కావాలి. ఈ ఇంట్లో నేను చక్రం తిప్పాలనుకుంటూ ఉంటుంది. తన తల్లి రజినీ దగ్గరకు సంగీత వచ్చి కాఫీ అడుగుతుంది. అప్పుడే కృష్ణ కిందకు దిగడం చూసిన రజినీ.. అదిగో పనిమనిషి వస్తోంది కదా.. నీకు, నాకు కాఫీ ఇస్తుందిలే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. రజినీ మాటలను విన్న‌ కృష్ణ.. వినలేనట్లుగా వెళ్లిపోతుంటుంది. హేయ్.. ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదల చేయడం రాదా.. కాఫీ ఇచ్చే పనిలేదా అంటు కృష్ణను‌ రజినీ తిడుతుంది.

రెండు నిమిషాల్లో కాఫీ తెస్తాను పిన్నీ అని వెళ్లిన కృష్ణ.. సరిగ్గా 2 నిమిషాలకు కాఫీ తెస్తుంది. ఏంటీ 2 నిమిషాలంటే.. 2 నిమిషాల్లో కాఫీ తెచ్చావని‌ సంగీత అంటుంది. మీరు మా బంధువులు కదా.. జాగ్రత్తగా చూసుకోవాలి కదా.. అందుకే టైమ్‌కి అందించాను.. మళ్లీ వెళ్లిపోతారు కదా.. మర్యాదలు చెయ్యాలి కదా అని కృష్ణ అంటుంది. మీరు కేవలం బంధువులు మాత్రమే.. త్వరలోనే పోతారులే అన్న మీనింగ్ వచ్చేలా రజినీకి కాలేలా చురకలు వేసి కాఫీ ఇచ్చేసి కృష్ణ వెళ్లిపోతుంది. ఇక సంగీత కాఫీ తాగబోతుంటే.. తల్లి‌ రజినీ తనను తాగనివ్వకుండా ఆపుతుంది. ఈ కాఫీ తాగితే నీకు ఏమొస్తుందే? అదే మీ బావను నిద్రలేపి తాగిస్తే ఈ ఆస్తి వస్తుంది. ఏది ఏమైనా నువ్వు ఆదర్శ్ భార్య కావాల్సిందేనని‌ రజినీ గట్టిగా అంటుంది. అది విన్న మీరా.. మీరు ఆదర్శ్‌ని లైన్‌‌లో పెట్టడానికి వచ్చారా అని‌ అంటుంది. ఏంటి వినేశావా.. ఇప్పుడు అందరికీ చెప్పేస్తావా? అసలు మా సంగీతతో ముందే ఆదర్శ్‌కి పెళ్లి అవ్వాల్సి ఉంది. కానీ ముకుందను చేసుకున్నాడంతే.. నువ్వు చెప్పినా.. నాకేం నష్టం లేదు’ అంటుంది రజినీ కోపంగా మీరా(ముకుంద)తో. ‘నేనెందుకు చెబుతాను.. మీ సంగీతతో ఆదర్శ్ పెళ్లి కావడానికి నేను కూడా మీకు సాయం చేస్తాను’ అంటుంది మీరా. మనసులో ఇలా అనుకుంటుంది. రేపు అన్నరోజున నేనే ముకుందనని నిజం తెలిసినా.. ఆదర్శ్ నుంచి నాకు సమస్య రాకూడదంటే.. ఈ సంగీతను ఆదర్శ్‌ని ముందే కలిపెయ్యాలని‌ మీరా అనుకుంటుంది. మాకు సాయం చేయడం వల్ల నీకేంటి లాభమని మీరాని‌ సంగీత అడుగగా..తను ఏదో ఒకటి చెప్పి‌ కవర్ చేస్తుంది.

తల్లి రజినీ చెప్పినవన్నీ చేస్తూ అదర్శ్ చేత తిట్లు తింటుంది సంగీత. మరోవైపు గేట్ దగ్గర నాన్న అని ముకుంద మాటలని విన్న కృష్ణ వెళ్ళి .. ఎవరిని నాన్న అని అంటున్నావ్? నువ్వు అనాథవి కదా అని అడుగుతుంది. ఇక వాళ్ళ ఓనర్ ని అలా నాన్న అని పిలుస్తానని మీరా కవర్ చేస్తుంది. ఇక అదే విషయం కృష్ణ అర్థం చృసుకొని..‌ మురారికి చెప్తుంది. తరువాయి భాగంలో ముకుందకు 11 రోజు పెద్దకర్మ ఏర్పాట్లు చేస్తే.. కాకి పిండం ముట్టలేదని భవానీ దేవి చెప్తుంది. ఇక అది భరించలేని మీరా..‌‌ నా స్నేహితురాలు ముకుంద గుర్తొచ్చిందని చెప్తూ ఏడుస్తుంది. దాంతో ఆదర్శ్ కరిగిపోతాడు. ఇక నుంచి ఈ మీరా.. మీరా కాదు. తనే ముకుంద.‌ ముకుంద అనే పిలుచుకుందాం. అప్పుడు ముకుంద లేదన్న బాధ అందరిలోను పోతుందంటు ఆదర్శ్ చెప్తాడు. అది విన్న ఇంట్లోని వారంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.