English | Telugu

యాదమ్మ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం చేసాడో తెలిస్తే మీరు కూడా తిడతారు.!

యాదమ్మ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం చేసాడో తెలిస్తే మీరు కూడా తిడతారు.!

అంతో ఇంతో పేరున్న బుల్లితెర లేదా వెండితెర సెలబ్రిటీ అరెస్ట్ అయితే ప్రేక్షకులు ఆశ్చర్యపోయే రోజులు పోయాయి. ఎవరైనా అరెస్ట్ అయ్యారనే న్యూస్ వస్తే చాలు.. డ్రగ్స్ కేసులోనో లేక ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన కేసులోనూ అరెస్ట్ అయ్యి ఉంటారని ముందే డిసైడ్ అవుతున్నారు. అయితే బుల్లితెర కమెడియన్, యూట్యూబర్ యాదమ్మ రాజు అరెస్ట్ అయ్యాడన్న న్యూస్ తెలిసి మాత్రం.. ప్రేక్షకులు అతన్ని ఫుల్ గా తిడుతున్నారు.

తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు యాదమ్మ రాజు. "అసలు తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి" అంటూ ఒక యూట్యూబ్ వీడియో లింక్ ని కూడా షేర్ చేశాడు. తీరా ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే.. 'Who is My Daddy' అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ప్లే అవుతుంది. ఆ సిరీస్ లో యాదమ్మ రాజు నటించాడు. అందులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. దీంతో తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రాంక్ చేసి.. తన సిరీస్ ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశాడు యాదమ్మ రాజు. అయితే దీనిని కొందరు నెటిజన్లు సరదాగా తీసుకోగా, మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఇలాంటి వేషాలు అవసరమా? అని కామెంట్స్ లో ఫుల్ గా తిడుతున్నారు. ఇంకా కొందరైతే.. సిరీస్ లో కంటెంట్ ఉంటే నువ్వు చూడొద్దన్నా కూడా మేము చూస్తామని, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం సిరీస్ బాగున్నా చూడమని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉన్నా.. యాదమ్మ రాజు కోరుకున్నట్టుగా అతని వెబ్ సిరీస్ కి మాత్రం రావాల్సిన పబ్లిసిటీ వచ్చిందనే చెప్పాలి.

యాదమ్మ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం చేసాడో తెలిస్తే మీరు కూడా తిడతారు.!