English | Telugu

సినిమాని తలపించే సీరియల్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే!

సినిమా మాదిరి ట్విస్ట్ లతో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులకి థ్రిల్ తో పాటు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంది. మరి ఆ సీరియల్ ఏంటో ఓసారి చూసేద్దాం... తెలుగు టీవీ సీరియళ్ళలో ఈ మధ్య కాలంలో హిట్ అయిన సీరియల్స్ చాలా తక్కువ. అయితే వాటిల్లో అత్యధిక రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి. దీనికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. అంతకముందు గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుధారలకి ఉండే క్రేజ్.. కాస్త ఇప్పుడు కావ్య, రాజ్ లకి వచ్చింది.

బ్రహ్మముడి సీరియల్ ‌లోని పాత్రలన్నీ బయట సమాజంలోని మధ్యతరగతి కుటుంబం, ధనిక కుటుంబం‌‌‌... ఇలా రెండు భిన్నమైన కుటుంబాలకి దగ్గరగా ఉంటుంది. విభిన్నమైన మనసులు గల ఇద్దరిని ఒక్కటి చేసే పెళ్ళి బంధాన్ని గౌరవిస్తూ సాగే ఈ సీరియల్ తెలుగింటి ఆడపడుచుల అభిమానాన్ని పొందింది. ముగ్గురు కూతుర్లు గల అమ్మ పాత్రలో కనకం.. తన కూతుళ్ళకి గొప్పింటి సంబంధం చేయాలని ఆలోచించే విధానం అందరికి నచ్చేస్తుంది. మరోవైపు గొప్పింటి కోడలిగా చేరిన కావ్య తన మెట్టినింటి పరువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అయితే ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లలో రాజ్ ఓ బాబుని తోసుకొచ్చాడు. అతనెవరి బాబు అంటే ఎవరడిగినా చెప్పకుండా.. చివరికి కంపెనీ ఎండీ భాద్యతలనుండి కూడా తప్పుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇంట్లోని వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో రాజ్ స్థానంలో కళ్యాణ్ నామమాత్రంగా ఉంటాడు. కావ్య తనకి సపోర్ట్ ఇస్తున్నా అని చెప్తుంది.

బాబు తల్లి ఎవరని రాజ్ ని కావ్య అడుగగా.. తన పేరు వెన్నెల అని చెప్తాడు. దాంతో కావ్యకి ఒకే ఆలోచన ఉంటుంది. తనెవరో? ఎక్కడుంటుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. కావ్య ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా.. ఓ ఫైల్ లో వెన్నెల అనే పేరుతో కొన్ని వివరాలు కనిపిస్తాయి. అయితే ఆమె జాడ వెతుక్కుంటూ కావ్య ఓ ఇంటికి వెళ్తుంది. మరోవైపు రాజ్ అంతరాత్మ రాజ్ ని.. వెన్నెల ఏ మబ్బుల వెనుక ఉన్న కావ్య కనిపెడుతదని అనుకుంటూ తనెవరో చెప్పమని ఇబ్బంది పెడుతుంది. మరి వెన్నెలని కావ్య కనిపెడుతుందా ? అసలు నిజమేంటి తెలియనుందా తెలియాలంటే నేటి కథానికం సాగనుంది. మరి మీలో ఎంతమంది ఈ ట్విస్ట్ కొరకు ఎదురుచూస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.