English | Telugu
సుశాంత్ కి తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ.. పైకి చెప్పలేని ఏదో బాధ
Updated : Jun 15, 2020
సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే సుశాంత్.. జూన్ 3న చివరి సారిగా తన తల్లి గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ కవితాత్మక పోస్ట్ పెట్టాడు. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు.. చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బ్రతుకుతున్నా' అంటూ సుశాంత్ పోస్ట్ పెట్టాడు. తన తల్లి ఫోటోను కూడా అతడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 2002లో తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకుంటూ సుశాంత్ ప్రేమతో పెట్టిన ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం అతడి ఆత్మహత్య నేపథ్యంలో వైరల్గా మారింది. సుశాంత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి లోను చేస్తోంది.