English | Telugu
భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు
Updated : Jun 15, 2020
పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ ను పోలీస్ స్టేషన్ నుంచి విఖ్యాత్ రెడ్డి తీసుకెళ్లారట. దీంతో, పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి, సదరు నిందితుడిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విఖ్యాత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 353, 224, 225, 212 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.