English | Telugu

భారత్ లో ఒక్కరోజులో 12 వేల కేసులు!!

భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. ఒక్కరోజులో దాదాపు 12 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,929 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో బాధితుల సంఖ్య 3,20,922కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 311 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 9,195 కు చేరింది. దీంతో.. కరోనా కేసుల్లో భారత్ నాల్గో స్థానానికి, మరణాలలో‌ 9వ స్థానానికి చేరింది. ప్రస్తుతం 1,49,348 యాక్టివ్ కేసులు ఉన్నాయి.