English | Telugu
అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్.. విచారణ వాయిదా..
Updated : Jun 19, 2020
కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐలో జరిగిన స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది. ఈ రోజు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో తమ వాదనలు వినాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తరపు లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. ఇదే సమయంలో బెయిల్ పిటిషన్, కస్టడీల పై ఒకేసారి వాదనలు వినాలని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.