కరోనా పరీక్షల్లో డొల్లతనం.. ఎమ్మెల్సీ కి ఏపీలో పాజిటివ్, హైదరాబాద్ లో నెగటివ్
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రోజుకి వేలల్లో పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. ఆ పరీక్షల్లో ఖచ్చితత్వం లేదని, డొల్లతనం కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.