English | Telugu

హీరో సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురై విశాఖకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్‌లో చూస్తూ ఆ యువతి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

మల్కాపురం మండలం శ్రీహరిపురానికి చెందిన సదరు యువతి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సుశాంత్‌ సింగ్ కు అభిమాని. ఆమె పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండేది. కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ కు సంబంధించిన వీడియోలను పదే పదే టిక్‌టాక్‌లో చూసింది. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం ఆమె మొబైల్‌ను పరిశీలించి సుశాంత్ సింగ్ మరణమే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు.