English | Telugu

ఏపీలో పదివేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు పది వేల మార్క్ ని దాటాయి. గడచిన 24 గంటల్లో 497 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన కేసుల్లో 448 మంది స్థానికులు కాగా, 37 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, 12 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,331 కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 10మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 129 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.