Bendi Baby Onion Curry & Stuffed Rice Puri
బెండి బేబీ ఆనియన్ కర్రీ
తయారు చేసే విధానం : ముందుగా బాణలిలో నూనె పోసుకుని కాగాక జిలకర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి కాస్త ఫ్రై చేసి, అందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, టమాట తరుగు, పసుపు, పుదీనా, ఉప్పు, కారం, బెండకాయలు , కరివేపాకు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరవాత అందులో దానిమ్మ గింజల పొడి, కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి.
స్టఫ్డ్ రైస్ పూరీ
తయారు చేయవలసిన విధానం : ముందుగా బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి, అది కాగేలోపు పూరీ స్టఫ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా కాలీఫ్లవర్ తీసుకుని అందులో తగినంత ఉప్పు, కారం, జిలకర , కొత్తిమీర , పుదీనా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి, ఇప్పుడు పిండి మిశ్రమంలోంచి కాస్త పిండిని తీసుకుని చిన్న పూరీలా చేసుకుని వీడియోలో చూపిన విధంగా కాలీఫ్లవర్ మిశ్రమాన్ని అందులో పెట్టి పూరీలా వత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతే స్టఫ్డ్ పూరీ రెడీ.
Recommended for you
