Read more!

Semiya Pulihora Recipe

 

 

 

సేమ్యా పులిహోర రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు :

సేమ్యా - రెండు కప్పులు

శనగపప్పు - ఒక స్పూన్

చింతపండు పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు

మినప్పప్పు- ఒక స్పూన్

ఉప్పు - తగినంత

మిర్చి - నాలుగు

అల్లం - చిన్న ముక్క

కరివేపాకు - రెండు రెమ్మలు

నూనె - మూడు టేబుల్ స్పూన్లు

ఆవాలు- ఒక స్పూన్

ఎండుమిర్చి- రెండు

వేరుసెనగ గుళ్ళు - సరిపడా

 

తయారు చేసే విధానం:

ముందుగా నీళ్ళు మరిగించి అందులో కొంచం ఉప్పు,అర స్పూను నూనె,సేమ్యా వేసి ఉడికించాలి.

అందులో కూల్ వాటర్ వేసి నిముషం వుంచి మొత్తాన్ని వంచేయ్యాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనె వేడి చేసి వేరుశనగ గుళ్ళు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు ఎండుమిర్చి వేసి తాలింపు వెయ్యాలి.

వేగాక కరివేపాకు,సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మిర్చి వేసి వేగాక కొంచెం పసుపు వెయ్యాలి.స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిలో చింతపండు పేస్ట్ ,తగినంత ఉప్పు వేసి కలపాలి.