Dondakaya Pakodi
దొండకాయ పకోడి
కావలసిన పదార్థాలు:
దొండకాయలు - పావుకిలో
నూనె - సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
శెనగపిండి - పావుకిలో
ఉప్పు - తగినంత
కార్నఫ్లోర్ - ఒక టేబుల్ స్పూను
పచ్చిమిరపకాయలు - నాలుగు
జీలకర్ర - ఒక టీ స్పూను
తయారుచేయు విధానం:
ముందుగా దొండకాయల్ని నిలువుగా, సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో శెనగపిండి, కార్న్ ఫ్లోర్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ పిండితో పకోడీలు వేసుకోవాలి.
Recommended for you
