Read more!

మష్రూమ్ కబాబ్

 

మష్రూమ్ కబాబ్!

కావలసిన పదార్థాలు:

పుట్టగొడుగులు - 200 గ్రాములు

కబాబ్ పౌడర్ - 1 ప్యాకెట్

అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

కారంపొడి - అర చెంచా

చికెన్ మసాలా - అర చెంచా

గుడ్డు - ఒకటి

ఉప్పు - రుచి సరిపడా

నూనె - కొద్దిగా

తయారీ విధానం:

- మష్రూమ్ కబాబ్ తయారు చేసే ముందు... పుట్టగొడుగులను బాగా కడగాలి.

- తర్వాత కబాబ్ పౌడర్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, చికెన్ మసాలా పొడి, గుడ్డు, నూనె, రుచికి సరిపడా  ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి.

- ఈ పదార్థాలన్నీ మష్రూమ్ కు పట్టేందుకు.. 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వండి.

- తర్వాత ఒక పాత్రలో నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.

-అందులో నానబెట్టిన పుట్టగొడుగులను వేసుకోని బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వీటిని వేయించండి.

-అంతె ఇప్పుడు వేడి వేడి మష్రూమ్ కబాబ్ రెడీ. టమోటా కచప్ తో సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.