Read more!

Batani Curry

 

 

బఠాని కర్రీ

 

 

కావలసిన పదార్దాలు :

ఎండు బటాణీలు - పావుకిలో

పసుపు - అరటీస్పూన్ 

జీలకర్ర - అరటీస్పూన్

మిరియాలు - ముప్పావు టీస్పూన్

పచ్చిమిర్చి - నాలుగు

అల్లం ముద్ద - టీస్పూన్

పుదీనా - కట్ట

కొత్తిమీర - కట్ట

చాట్ మసాల - అర టీస్పూన్

నెయ్యి - పావు కప్పు

ఉప్పు - తగినంత


తయారి విధానం :

బటానీలను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి బటానీలను ఉడికించాలి. ఉడికిన తరువాత నీళ్ళు వంపేయాలి. జీలకర్ర, చాట్ మసాల, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముద్ద, అల్లం, పుదీనా, కొత్తిమీర తురుముల్ని ఉడికించిన బటాణీలలో వేసి బాగా దగ్గరగా వచ్చేఅంతవరకు కలపాలి. చివరగా నెయ్యి, కొంచెం ఉప్పు వేసి దించేయాలి. చపాతి, పూరీల్లోకి ఈ కూర బాగు౦టుంది.