Read more!

ఆలు వంకాయ ఫ్రై!

 

 

ఆలు వంకాయ ఫ్రై!

 

కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బంగాళాదుంపలు - పావు కిలో

చిన్న ముక్కలుగా తరిగిన వంకాయలు - పావు కిలో

ఉల్లిపాయ - 1 పెద్దది

పచ్చిమిర్చి - 2

తాళింపు దినుసులు - 2 టేబుల్ స్పూన్స్

కారం - 1 టేబుల్ స్పూన్

కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు - 5

పసుపు - అర టీ స్పూన్

నూనె - 2 టేబుల్ స్పూన్స్

ఉప్పు - రుచికి సరిపడా

దాల్చిన చెక్క పొడి - పావు టీ స్పూన్

లవంగాల పొడి - కొద్దిగా

కొత్తమీర -కొద్దిగా

కరివేపాకు: సరిపడ

తయారీ విధానం:

-ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి.

-ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి , వంకాయ ముక్కలు వేసి మీడియం మంటపై వేయించాలి.

-వంకాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. అందులో ఉడికించిన బంగాళదుంపలు వేయాలి. అంతా కలిసేలా బాగా కలుపుకుని మూతపెట్టి 5 నిమిషాలు చిన్న మంటపై మగ్గించాలి.

- తర్వాత కొత్తిమీర, దాల్చిన చెక్కపొడి, లవంగాల పొడి వేసి కలపాలి. మరోనిమిషం పాటువేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన ఆలూ వంకాయ ఫ్రై రెడీ.