ఉగ్ర కుట్రను చేధించిన ఢిల్లీ పోలీసులు...8 మంది అరెస్ట్

Publish Date:Feb 22, 2026

Advertisement

 

తాజాగా భారీ ఉగ్రకుట్రను  ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐ‌తో పాటు బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని అరెస్టు చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఏకకాలంలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో భారీ ఉగ్రదాడికి వీళ్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీ హ్యాండ్లర్ల ఆధ్వర్యంలో భారత్‌లో వీళ్లు ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. 

తమిళనాడులోని తిరుప్పుర్‌ జిల్లాలో మిజనూర్ రహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్, లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు బంగ్లాదేశీయులని పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా వారు నకిలీ ఆధార్ కార్డులను వినియోగించారని పేర్కొన్నారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆన్‌లైన్ పోస్టులపై దర్యాప్తు జరుపుతుండగా నిందితుల గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఓ దుస్తుల ఫ్యాక్టరీలో ఈ ఆరుగురు పనిచేస్తున్నట్టు తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తయ్యబా భారత్‌లో దాడులను ప్లాన్ చేస్తున్నట్టు శనివారం నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వారు దాడులకు సిద్ధమైనట్టు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

By
en-us Political News

  
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది.
హైద‌రాబాద్ రాయ‌దుర్గం పీఎస్ ప‌రిధిలో చిత్ర‌పురి కాల‌నీలో ఒక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరపైకి వచ్చింది.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు ప్రజాదరణ పొందుతున్నాయి.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.