ఫాల్కన్ యాప్ చీటింగ్ కేసు సీఓ వికాస్ కుమార్ అరెస్ట్

Publish Date:Feb 25, 2026

Advertisement

 

భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ కుమార్ సఖేర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ కేసులో ఫాల్కన్ చైర్మన్, సీఈఓలను అరెస్ట్ చేసిన సీఐడీ, తాజాగా వికాస్ అరెస్టుతో దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మల్టీనేషనల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను డిపాజిటర్లకు పంచుతామని నమ్మబలికిన నిందితులు, ఫాల్కన్ యాప్ ద్వారా భారీగా నిధులు సేకరించినట్టు విచారణలో తేలింది. 

అధిక వడ్డీ, తక్కువ సమయంలో డబుల్ రిటర్న్స్ అనే ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజలను మభ్యపెట్టినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఫాల్కన్ గ్రూప్ దేశవ్యాప్తంగా 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లను సేకరించింది. ఇందులో 4,065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్ల మేర మోసం జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. పెట్టుబడుల పేరుతో డబ్బు లు తీసుకున్న తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఫిర్యాదులు చేయడంతో ఈ భారీ స్కాం బయటపడింది. 

నిందితులు సేకరించిన నిధులను వివిధ ఖాతాలకు మళ్లించి దుర్వి నియోగం చేసినట్టు సీఐడీ అనుమానిస్తోంది. డబ్బుల మార్గాలను ట్రాక్ చేయడా నికి బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇంకా పలువురు కీలక వ్యక్తుల పాత్రపై విచారణ కొనసాగుతోందని అధికా రులు తెలిపారు. వికాస్ కుమార్ సఖేర్ అరెస్టుతో ఫాల్కన్ గ్రూప్ కార్యకలాపా లపై మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశముం దని అధికారులు పేర్కొం టున్నారు.. పెట్టుబడిదారు లకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని సీఐడీ స్పష్టం చేసింది. ఈ కేసులోమరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..


 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
హైద‌రాబాద్ రాయ‌దుర్గం పీఎస్ ప‌రిధిలో చిత్ర‌పురి కాల‌నీలో ఒక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరపైకి వచ్చింది.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు ప్రజాదరణ పొందుతున్నాయి.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.