అద్భుతం జరిగితేనే...సెమీస్‌కు పాక్‌!

Publish Date:Feb 25, 2026

Advertisement

 

టీ-20 ప్రపంచ కప్-2026 సూపర్-8పోరులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. బుధవారం పల్లెకెలె వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సేన రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రారంభం నుంచి మ్యాచ్ ఉత్కంఠ రేపినా.. చివరకు ఇంగ్లీష్ జట్టునే విజయం వరించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 


సూపర్-8లో భాగంగా పాకిస్థాన్‌కు శ్రీలంకతో జరిగే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇంగ్లాండ్ ఫిబ్రవరి 27న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్.. తన చివరి మ్యాచ్ శ్రీలంకపై తప్పనిసరిగా గెలవాలి. ఇదే సమయంలో ఇంగ్లండ్, శ్రీలంక చేతుల్లో న్యూజిలాండ్‌ ఓడిపోవాలి. అప్పుడు పాకిస్థాన్ 3, శ్రీలంక 2, న్యూజిలాండ్ 1 పాయింట్‌తో టేబుల్ పట్టికలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయి. 

ఈ పరిస్థితిలో గ్రూప్-2 నుంచి రెండో స్థానంలో నిలిచిన జట్టుగా పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుతుంది.
ఇక రెండో చాన్స్ .. న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడి.. పాకిస్థాన్,  శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అలా అయితే.. పాకిస్థాన్, కివీస్ జట్లు రెండూ 3 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాక్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో అవకాశం వరుణుడిపై ఆధారపడిఉంది. 

పాక్, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాక్ కు 2 పాయింట్లు వస్తాయి. ఇదే సమయంలో శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావాలి. అలానే ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాలి. ఇవ్వన్నీ జరిగితే.. పాక్, శ్రీలంక, కివీస్ జట్లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లలో మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో కలిసి సెమీస్‌కు చేరుతుంది.

 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు ప్రజాదరణ పొందుతున్నాయి.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో చ‌దువుకుంటున్నా, అమ్మ‌లాంటి తెలుగుభాష‌ను మ‌రువొద్ద‌ని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు.
తాజాగా మరో సారి తెలంగాణలోని నాంపల్లి కోర్టు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు లేఖలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు ఆయా కోర్టుల ఆవరణల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులను ఖాళీ చేయించి ఈ తనిఖీలు నిర్వహించారు.
బీహార్‌లో ప్రేమ విఫలం కావడంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన సంచలనం రేపింది.
మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే శనివారం (ఫిబ్రవరి 28) పంపిణీ చేయనుంది. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం రాకుండా ఫిబ్రవరి 28న చెల్లింపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు అధికారిక ఉత్తర్వులు అందాయి.
జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిందితుడు పారిపోవాలని ప్లాన్ చేసినా… పోలీసుల ఎల్ఓసి ముందే వచ్చింది. ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లేలోపే బోర్డింగ్ పాస్ కు బదులు అరెస్ట్ మెమో చేతికి అందించిన పోలీసులు అక్కల రామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేశారు.
కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్‌ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక మైన గుర్తింపు పొందింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.