బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో రూ.18 కోట్ల విలువగల గంజాయి పట్టివేత
Publish Date:Feb 25, 2026
Advertisement
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ ‘సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్’ తెరపైకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి దిగిన ఇద్దరు ప్రయాణికులు తమ లగేజ్‌తో కూల్‌గా బయటకు జారిపోవాలనుకున్నారు. కానీ కస్టమ్స్ అధికారుల స్కానర్ కళ్లకు మాత్రం వారి ప్లాన్ ‘క్లియర్ పిక్చర్’గా కనిపించింది. బ్యాంకాక్ నుండి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు చాలా తెలివిగా వారి లగేజ్ బ్యాగ్ కింద భాగాన్ని ప్రత్యేకంగా మార్చి గంజాయిని దాచిపెట్టి హుందాగా నడుచుకుంటూ వచ్చారు. కానీ చివరకు ఆ తెలివితేటలు స్కానింగ్ మెషీన్ ముందు పని చేయలేదు. స్కానింగ్ మిషన్‌లో అసలు విషయం బయట పడడంతో అధికారులు వారి బ్యాగులను తనిఖీలు చేయగా ఒక్కో బ్యాగ్ నుంచి గుట్టలు గుట్టలుగా విదేశీ గంజాయి బయటపడింది. మొత్తం.రూ.18 కోట్లు రూపాయలు విలువ చేసే 18 కిలోల మత్తు పదార్థాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు “టూర్ ముగిసింది… ఇప్పుడు జైలు ట్రిప్ స్టార్ట్” అన్నట్టుగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎన్డీయే యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉందా? ఈ గంజాయి ఎవరెవరికి సరఫరా చేయనున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగించారు.
http://www.teluguone.com/news/content/bangalore-airport-36-214667.html





