ఈ కాలంలోనూ ఇంత ప్రేమా...భామా!
Publish Date:Feb 25, 2026
Advertisement
హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో చిత్రపురి కాలనీలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. కోమలి అనే అమ్మాయి ఇటు చదువుకుంటూ అటు యూట్యూబ్ వీడియోలు చేసేది. ఆమెకు ఈ క్రమంలో సాటి యూట్యూబర్ అఖిల్ రెడ్డితో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత అది ప్రేమగా రూపాంతరం చెందింది. ఇద్దరి మధ్య మూడేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. ఏడాది క్రితం వీరిద్దరి మధ్య బ్రేకప్ వచ్చింది. విడిపోయారు. అయితే అఖిల్ రెడ్డిని ఎంతకీ మరచిపోలేక ఆర్నెల్ల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీంతో అదురుకున్న అఖిల్ రెడ్డి ఆమె తల్లి, ఇతర బంధువులతో ఈ విషయం చెప్పుకుని బాధ పడ్డాడు. భయపడ్డాడు. కానీ కోమలి అతడ్ని వదల్లేదు. అతడు కూడా చాటు మాటుగా కోమలిని కలుస్తూనే వచ్చాడు. అయితే కోమలితో జీవితాంతం అంటే తన వల్ల కాదనేవాడు. ఆమె మాత్రం మనిద్దరం కలసే ఉందామని అంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అఖిల్ రెడ్డి మరో అమ్మాయితోనూ సరిగ్గా ఇలాగే ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు చెబుతున్నారు. ఇదే ఈ ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమైందని అంటారు. ఇదే ఏడాది కాలంగా వీరి మధ్య గొడవలకు రీజన్ గా మారింది. ఇదంతా ఇలా ఉంటే గత శనివారం రాత్రి అఖిల్ రెడ్డి కోమలి ఉంటున్న ఇంటికి వచ్చాడు. కోమలి తండ్రి విశాఖ ఏజెన్సీలో పని చేస్తుండగా.. తల్లి వరలక్ష్మి మాత్రం దుబాయ్‌లో పని చేస్తోంది. కోమలి తన మామ ఇంట్లో ఉంటోంది. అయితే శనివారం రాత్రంతా ఇద్దరి మధ్య ఈ విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. తన ప్రియుడ్ని తనతోనే ఉండిపోవల్సిందిగా ఆమె డిమాండ్ చేసింది. తన ప్రియుడి కోసం బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టిందా రాత్రి. ఈ ఇద్దరి మధ్య ఈ గొడవ ఆదివారం ఉదయం పదిన్నర వరకూ కొనసాగింది. తర్వాత అతడు వెళ్లిపోగా.. ఆమె గుమ్మం దగ్గర చేరి అలాగే చూస్తుండి పోయింది. అతడు తన ప్రతిపాదన ఎంతకీ ఒప్పుకోక పోవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆదివారం అర్ధరాత్రి, అంటే సోమవారం వేకువజామున ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. బేసిగ్గా కోమలి ఎంతో అందంగా ఉంటుంది. సినిమాల్లోకి కూడా వెళ్లాలన్న ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రేమలో పడ్డం వల్ల వచ్చిన తంటా ఇది. 24 ఏళ్ల క్రితం చనిపోయిన ప్రత్యూష పరిస్థితి కూడా ఇంతే. కెరీర్ తొలినాళ్లలోనే సిద్ధార్ధ్ రెడ్డి ప్రేమలో పడి జీవితాన్ని కోల్పోయింది.ఇక కోమలి సిట్యువేషన్ చూస్తే చదువుకుంటూనే ఆమె యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇందులోనే ఎంతో ఎత్తులుకు ఎదగాలని కోరుకున్న ఆమె.. ఆ దిశగా వెళ్లకుండా పక్కదారి పట్టింది. ఇంతలో అతడు రూటు మార్చాడు. దీంతో ఈమె బాగా డిస్ట్రబ్ అయ్యింది. అలాంటి పరిస్థితికి వెళ్లిపోయింది. ఇప్పుడా తల్లిదండ్రులకు ఎంత కడుపుకోత. తన అందాల కూతురిని ఇంత అంద విహీనంగా మారుతుందని తాను కలలో కూడా ఊహించలేదంటారా తల్లి. పెళ్లిపీటలు ఎక్కాల్సిన పిల్ల పాడె ఎక్కడమేంటో తమకు పాలు పోవడం లేదంటారామె. అఖిల్ రెడ్డి తన కుమార్తెను పిచ్చిదాన్ని చేసి ఆడించాడని.. నా కూతుర్ని నాకు కాకుండా చేశాడని.. ఆవేదన వెలిబుచ్చుతారామె. అమ్మా! నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నా అని నాతో అనేది.. తీరా చూస్తే అతడి వల్లో చిక్కి ఇలా జీవితాన్ని అర్ధాంతరంగా చాలించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె. ఇలాంటి కోమలి కన్నీటి గాథలు తిరిగి తిరిగి జరక్కుండా ఉండాలంటే అఖిల్ రెడ్డిలాంటి వారికి బుద్ధి వచ్చేలా చేయాలన్నారామె. .అందులో భాగంగా అఖిల్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇవాళ్రేపు ఇలాంటి ఒరిజినల్ ప్రేమకథలు లేవు. అంతా ఉల్టాపల్టా నడుస్తున్నాయ్. సహజీవనాలు బ్రేకప్‌లు సర్వసాధారణం అయిపోయాయి. ఈ కాలంలో ప్రేమను సీరియస్‌గా తీసుకుంటున్న వారు కూడా లేరు. ప్రతి సంబంధం ఒక ఆర్ధిక సంబంధం ఎలాగో ఇదీ అలాగే అయిపోయింది. ప్రతి ప్రేమా ఒక శారీరక సంబంధంగా మారిపోయిన ఈ రోజుల్లో కూడా కన్నవారిని వదిలి ఈ విధంగా కట్టెల పరుపు ఎక్కిన కోమలి కన్నీటి గాథ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.
http://www.teluguone.com/news/content/youtuber-komali-suicide-36-214668.html





