బండ్లగూడ చిన్నారి మృతి కేసులో ఒకరు అరెస్టు

Publish Date:Feb 22, 2026

Advertisement

 

బండ్లగూడలోని క్రియాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఘటనపై వైద్యశాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారి లక్ష్మి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆసుపత్రిలో విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే డ్రగ్ ఇన్స్పెక్టర్‌తో పాటు వైద్యశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కాలం చెల్లిన టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. జనవరి నెలలోనే గడువు ముగిసిన టాబ్లెట్లను చిన్నారికి ఇవ్వడం వల్లే రియాక్షన్ వచ్చినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

జ్వరంతో బాధపడుతున్న చిన్నారికి ఇచ్చిన మందుల వివరాలు, చికిత్స విధానం, డోసుల పరిమాణం వంటి అంశాలను అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. రియాక్షన్ రావడంతో పరిస్థితిని నియంత్రించేందుకు ఆసుపత్రి సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చినట్లు సమాచారం. శిశువుల బరువు, వయసును ఆధారంగా చేసుకుని మాత్రమే మందుల డోసులు ఇవ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారి లక్ష్మి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆ ఇంజక్షన్‌ను కేవలం వైద్యుడు మాత్రమే 0.1 నుంచి 0.6 మోతాదులో శిశువు వయసుకు అనుగుణంగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. 

చిన్నారి కేస్‌షీట్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించను న్నారు. ఇక చిన్నారి మృతికి కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. 

ఆసుపత్రి నిర్వహణలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. బండ్లగూడ కియాన్స్ ఆసుపత్రి యజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి...కియాన్స్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ని అదుపు తీసుకున్నారు.. బాబుకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు .. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బండ్లగూడ ఘటనపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది.
హైద‌రాబాద్ రాయ‌దుర్గం పీఎస్ ప‌రిధిలో చిత్ర‌పురి కాల‌నీలో ఒక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరపైకి వచ్చింది.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు ప్రజాదరణ పొందుతున్నాయి.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.