తాళం దాచిన చోటే దొంగకు ఛాన్స్…14 తులాల గోల్డ్ చోరీ
Publish Date:Feb 25, 2026
Advertisement
సర్వసాధారణంగా చాలామంది ఇంటి తాళం చెవి బయట ఉన్న పూల కుండీ కింద , చెప్పుల స్టాండ్ లో లేదా డ్రమ్ము కింద ఇలా రకరకాల వస్తువుల కింద తాళం చెవి పెట్టి వెళ్తూ ఉంటారు.... ఓ వృద్ధ దంపతులు కూడా ఇంటికి తాళం వేసి ఆ తాళం చెవి ఇంటి పక్కన ఉన్న డ్రమ్ కింద పెట్టి వెళ్లడంతో అది గమనించిన దొంగ అదే అదనుగా భావించి ఇంట్లో మొత్తం దోచుకొని పారిపోయిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది...ఓ ఇంటి యజమాని తాళం చెవిని దాచిన దృశ్యాన్ని గమనించిన కాలనీ వ్యక్తి అదే తాళంతో లోపలికి ప్రవేశించి సుమారు 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు వేగంగా స్పందించి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో నివాసం ఉంటున్న రేకపల్లి లక్ష్మి (63) ఈ నెల 23న సాయంత్రం బయటకు వెళ్తూ ఇంటి తాళం చెవిని తలుపు పక్కనే ఉన్న డ్రమ్ కింద దాచారు. ఈ విషయం గమనించిన అదే ప్రాంతానికి చెందిన పత్రో శంకర్ (36) ఆమె వెళ్లిన వెంటనే అక్కడికి చేరుకుని తాళం తీసి తలుపు తెరిచి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోని టీవీ టేబుల్‌పై ఉన్న అల్మారా తాళం చెవులతో లాకర్‌ను తెరిచి అందులోని బంగారు నగలను దోచుకుని పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న లక్ష్మి దంపతులు అల్మారా తెరిచి ఉండటాన్ని గమనించి షాక్‌కు గుర య్యారు. లాకర్‌లో ఉన్న నగలు కనిపించకపోవడంతో వెంటనే జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేపట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. విశ్వసనీయ మైన సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు నిందితుడు పత్రో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనం చేసినట్టు అంగీకరించడంతో అతని వద్ద నుంచి ఒక బంగారు హారం, నల్లపూసల గొలుసు, మూడు పొరల గొలుసు, లాకెట్‌తో ఉన్న గొలుసు, నాలుగు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల హెచ్చరికఇళ్లకు తాళం వేసి బయ టకు వెళ్లేటప్పుడు తాళం చెవులను డోర్‌మ్యాట్‌ల కింద, షూ ర్యాక్‌లలో, కిటికీ సందుల్లో లేదా డ్రమ్‌ల వెనుక దాచడం ప్రమాదక రమని పోలీసులు హెచ్చరి స్తున్నారు. ఇలాంటి అల వాట్లు దొంగలకు సులభంగా అవకాశాలు కల్పిస్తాయని, భద్రత కోసం విశ్వసనీయ వ్యక్తుల వద్ద తాళం ఉంచడం లేదా ఆధునిక లాకింగ్ విధానాలు ఉపయో గించడం మంచిదని సూచించారు.
http://www.teluguone.com/news/content/-jagadgirigutta-police-station-36-214670.html





