మావోయిస్టు గణపతి లొంగిపోవాలని సోదరుడి విజ్ఞప్తి

Publish Date:Feb 25, 2026

Advertisement

 

దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని తన కనుసన్నల్లో నడిపి.. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయన కోసం స్వగ్రామమైన బీర్పూర్ అంతా ఎదురు చూస్తోందన్నారు. గణపతి సోదరుడు రాంచంద్రరావు జగిత్యాలలో మాట్లాడుతూ మిగిలిన జీవితం తమతో గడపాలని గణపతిని కోరారు. 

ఈ సందర్భంగా  గణపతికి ఎటువంటి హాని తలపెట్టవద్దని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. తన సోదరుడు గణపతి నేపాల్‌లో ఉన్నారని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తల్లో చూశానని ఈ సందర్బంగా రాంచంద్రరావు పేర్కొన్నారు. పుట్టిన గడ్డ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడాలంటూ గణపతికి మీడియా ద్వారా సోదరుడు సూచించారు. 43 ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. 

మావోయిస్టులంతా లొంగిపోయారని.. నువ్వు కూడా లొంగిపోవాలంటూ సోదరుడుకి రాంచంద్రారావు హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు లొంగిపోయారు. అదే సమయంలో మావోయిస్ట్ అగ్రనేత గణపతి నేపాల్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన వృద్ధాప్య సమస్యలతోపాటు  అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.

 

By
en-us Political News

  
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది.
హైద‌రాబాద్ రాయ‌దుర్గం పీఎస్ ప‌రిధిలో చిత్ర‌పురి కాల‌నీలో ఒక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరపైకి వచ్చింది.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు ప్రజాదరణ పొందుతున్నాయి.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో చ‌దువుకుంటున్నా, అమ్మ‌లాంటి తెలుగుభాష‌ను మ‌రువొద్ద‌ని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు.
తాజాగా మరో సారి తెలంగాణలోని నాంపల్లి కోర్టు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు లేఖలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు ఆయా కోర్టుల ఆవరణల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులను ఖాళీ చేయించి ఈ తనిఖీలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.