ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

 

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆర్చర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచారు.ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను 235-233 తేడాతో ఓడించి భారత పురుషుల జట్టు టైటిల్‌ గెలిచింది. 

రిషభ్‌ యాదవ్‌, అమన్‌ సైనీ, ప్రథమేశ్‌ త్రయం ఈ ఘనత సాధించింది. దీంతో దేశం తరుపున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడీ రజతంతో సరిపెట్టుకుంది.తొలుత ఆస్ట్రేలియాను, ఆ తర్వాత అమెరికాను చిత్తుచేసిన భారత త్రయం.. సెమీస్‌లో టర్కీని ఓడించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై భారత్‌ విజయం సాధించింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu