ఎట్టకేలకు 13న మణిపుర్‌కు ప్రధాని!

 

ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది.  ప్రధాని పర్యటనకు సంబంధించి మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపూర్ అల్లర్ల చెలరేగినప్పటి నుంచి ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. 2023 మే నెలలో మణిపూర్‌లో కుకీ, మైతీ తెగల మధ్య హింస చెలరేగిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు రెండు ప్రముఖ కుకీ-జో గ్రూపులతో ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది. 

మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతను కొనసాగించడం, దుర్బల ప్రాంతాల నుంచి శిబిరాలను తరలించడం, రాష్ట్రంలో శాంతి-స్థిరత్వం పునరుద్ధరణ కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించిన నిబంధనలు, షరతులను ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంపై కేఎన్‌వో(కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌), యూపీఎ్‌ఫ(యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌) సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ, మణిపుర్‌ ప్రభుత్వం, కేఎన్‌వో, యూపీఎఫ్‌ ప్రతినిధులు  ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu