తెలంగాణ అన్ స్టాపబుల్ మాత్రమే కాదు..అన్ బీటబుల్!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన   తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో  భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వచ్చే పాతికేళ్లలో తెలంగాణను  దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రం గా తెలంగాణ అన్న లక్ష్యంతో కృషి చేయాలన్న ఆశయం మహోత్కృష్టమైనదన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో    భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో   ప్రసంగించిన దువ్వూరి సుబ్బారావు.. తను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో   ఆర్థిక కార్యదర్శిగా,  ఖమ్మం కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.   ఇప్పుడు తాను హైదరాబాద్ వాడిననీ, తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు.  

తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటబుల్  అంటున్నానని చెప్పారు.   చైనాలోని గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.  2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించడానికి,   ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించాలన్న దువ్వూరి సుబ్బారావు, ఇది నిజంగా ఒక చాలెంజ్, కొంచం కష్ట సాధ్యమే అయినప్పటికీ ఇంతటి గొప్ప లక్ష్యం పెట్టుకున్న సీఎం రేవంత్ ను అభినందిస్తున్నాన్నారు. హైదరాబాద్ ను అద్భుత నగరంగా అభివర్ణించిన దువ్వూరి సుబ్బారావు,  ఒకప్పుడు తెలంగాణ పేదరికంతో వెనుకబడి ఉండేది కానీ,  ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కిందట  ప్రజలందరూ బెంగళూరుకు వెళ్లేవారు, ప్పుడు అందరూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారనీ, దీన్ని బట్టే  తెలంగాణ గొప్పతనం ఏంటో అఅర్ధం చేసుకోవచ్చని దువ్వూరి అన్నారు.  

తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, నీతి ఆయోగ్ సంస్థలకు చెందిన మేధావులతో రూపొందించడం అభినందనీయమన్న ఆయన  సలహా మండలి సభ్యుడిగా ఈ డాక్యుమెంట్ అమ లుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అభివృద్ధి సాధించిందనీ,  ఇప్పుడిక తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇతర ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu