హైదరాబాద్‌లో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు... యువతి మృతి
posted on Sep 7, 2025 12:50PM
.webp)
హెల్మెట్ పెట్టుకోవాలని ,రాంగ్ రూట్లో వెళ్లకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, కార్ డ్రైవ్ చేసినప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పోలీసులు ఎన్నో మార్లు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. కానీ యువత వాటిని పట్టించుకో కుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ... రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతూ ఉంటారు. ద్విచక్ర వాహనం పైన వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ దానికుండే క్లిప్పు మాత్రం పెట్టుకోరు. అలాగే కార్ లో ప్రయాణం చేసేటప్పుడు అసలు సీట్ బెల్ట్ వాడరు.
ఇది యువత చేసే నిర్లక్ష్యం.... అందుకు ఫలితం రోడ్డు ప్రమాదంలో నిండు జీవితాలు బలి.... నిన్న గణేశుని నిమజ్జనం కనుల పండగ జరిగింది. గణేశుడు నిమజ్జనం అనం తరం కొందరు యువతీ, యువ కులు కలిసి ఒక కారులో పీకలదాకా మద్యం సేవిస్తూ... యమ స్పీడ్ గా వాహనం నడిపారు. ఫలితంగా ఒకరు మృతి... పలువురికి తీవ్ర గాయాల య్యాయి... ఈ ఘటన హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
లంగర్ హౌస్ దర్గా సమీపంలో మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. పోలీసులు సహా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా లంగర్‌హౌస్ దర్గా సమీపంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఉన్న పోలీసు వాహన్ని ఒ కారు వెను నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందన్న పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.