మరో పోలీస్ అధికారిపై వేటు వేసిన సీపీ సజ్జనార్

హైదరాబాద్ లో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం,  భూవివాదాల్లో జోక్యం వంటి వాటికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సీపీ సజ్జనార్  ఇటీవల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిదే. ఆ క్రమంలోనే  తాజాగా కూల్సుంపుర ఏసీపీ మునావర్‌పై చర్య తీసుకున్నారు.  ఆయనను తక్షణమే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

ఏసీపీ మునావర్‌పై అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో జోక్యం, కొన్ని కేసుల్లో  అనచితంగా వ్యవహరించారన్న  పలు ఫిర్యాదులు అందడంతో సిపి సజ్జనార్  పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అధికారుల విచారణలో కుల్సంపుర ఏసీపి మునావర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలడంతో ఆయన పై చర్యలు తీసుకున్నారు.  మునావర్  సిబ్బందిపై దురుసు ప్రవర్తన, తన మాట వినని పోలీస్ సిబ్బందిని పరువు తీసే విధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు కూడా కమిషనర్ దృష్టికి వచ్చాయి.

దీనిపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరోపణలు నిజమని విచారణలో తేలడంతో హైదరాబాద్ సిపి సజ్జనార్.. కుల్సంపుర ఏసిపి మునావర్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఇంతకుముందే టప్పాచబుట్ర ఇన్‌స్పెక్టర్ అభిషిలాష్, కూల్సుంపుర ఇన్‌స్పెక్టర్ సునీల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల పనితీరు, వ్యవహారశైలిపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu