స్టార్టప్ ల కోసం వెయ్యి కోట్లతో ప్రత్యేక నిథి.. సీఎం రేవంత్

తెలంగాణలో స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో స్టార్టప్ ల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్  లో గూగూల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలను ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సహకాలను వినియోగించుకుని స్టార్టప్ లు భవిష్యత్ లో గూగుల్ వంటి సంస్థలుగా విస్తరించాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్రంలో స్టార్టప్‌ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన గూగుల్ ఒక స్టార్టప్ గా ఆరంభమై ప్రపంచ దిగ్గజంగా ఎదిగిన విషయాన్ని   అదే స్ఫూర్తితో మన స్టార్టప్‌లు కూడా ఎదగాలన్నారు. గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు 20 ఏళ్ల క్రితం చిన్న స్టార్టప్‌లుగా మొదలైనవేనన్న ఆయన, ఇప్పుడవి  బిలియన్ డాలర్ల కంపెనీలుగా మారాయన్నారు. "హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్‌గా మిగిలిపోకుండా ఇక్కడి స్టార్టప్ లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆకాం క్షించారు. 2034 నాటికి తెలంగాణను   ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu