అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
posted on Dec 10, 2025 10:27AM

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్ మోల్ అనిల్ అంబానీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారంటూ ఆ బ్యాంక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తన వ్యాపార కార్యకలాపాల కోసం ముంబైలోని స్పెషలైజ్డ్ ఎస్‌సీఎఫ్ బ్రాంచ్ నుండి రూ.450 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ పొందింది. ఈ రుణం మంజూరులో భాగంగా కంపెనీ సకాలంలో వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, భద్రత, ఇతర నిబంధనలను పాటించడం వంటి ఆర్థిక క్రమశిక్షణను రిలయెన్స్ హోం ఫైనాన్స విఫలం కావడంతో బ్యాంకు 2019లోనే ఈ లోన్ అకౌంట్ ను నిరర్థక ఆస్తిగా బ్యాంక్ వర్గీకరించింది.
నిబంధనలు గుర్తుచేసినా, పర్యవేక్షణ చేసినా కంపెనీ పదేపదే డిఫాల్ట్ అవ్వడంతో ఫిర్యాదు చేసింది. తీసుకున్న నిధులను ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించి దుర్వినియోగం చేశారని ఆడిట్ గుర్తించింది. అయితే ఈ ఆరోపణలపై రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.