ఆసీస్ సిరీస్‌కు కెప్టెన్‌గా శుభమన్ గిల్

 

టీమిండియా వన్డే కెప్టెన్‌గా  శుభమన్ గిల్‌కు బీసీసీఐ  బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు  జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కింది. జస్ప్రీత్ బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు. గాయం కారణంగా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య దూరమయ్యారు.

అయితే.. కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. మార్చిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ మళ్లీ కనబడలేదు. ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో ఇద్దరికీ స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో 19 రోజుల వ్యవధిలో భారత్‌ ఎనిమిది మ్యాచ్‌లు (3 వన్డేలు, 5 టీ20లు) ఆడనుంది. అక్టోబరు 19న వన్డే సిరీస్‌ ఆరంభమవుతుంది.

వన్డే జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ద్రువ్ జురేల్, యశస్వి జైశ్వాల్.

ట్వీ20 జట్టు : సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu