కన్నతల్లినే కడతేర్చాడు!
posted on Oct 4, 2025 2:22PM
.webp)
కనీ పెంచిన తల్లిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో వలసిన కొడుకు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కల కలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మానుపాటి ఐల్లమ్మ(50) ను ఆమె కుమారుడే దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మానుపాటి ఐల్లమ్మ కుమా రుడు శ్రీకాంత్(37) మద్యానికి బానిసై నిత్యం తల్లితో డబ్బుల కోసం గొడవపడేవాడు. ఇదే క్రమంలో శ్రీకాంత్ మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వ మంటు తల్లితో గొడవపడ్డాడు. దుర్భాషలాడాడు.
అయినా ఐలమ్మ మాత్రం కుమారుడికి డబ్బులు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆగ్రహం పట్టలేని శ్రీకాంత్ తన తల్లి ఐల్లమ్మ తలపై సుత్తితో గట్టిగా కొట్టి.... పదునైన చాకుతో ఇమె మెడలో పొడిచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి, రక్తపు మడుగులో పడి ఉన్న ఐల్లమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.