ఏనుగుల ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్ సేవలు
posted on Sep 5, 2025 2:27PM
.webp)
చిత్తూరు జిల్లాను ఏనుగుల బెడద అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. పొలాలపై పడి పంటలను నాశనం చేయడమే కాకుండా, జనాలపై దాడి చేస్తున్న సంఘటనలు, ఆ దాడులలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటలూ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ఓ కొత్త ప్రయోగం చేపట్టారు. ఏనుగుల సంచారం, కదలికలపై ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా ఇటీవల కాలంలో అనేక మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగుల గుంపును చెదరగొట్టడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులను తీసుకు వచ్చారు. ఆ ప్రయత్నం కూడా పూర్తిగా ఫలించలేదు. ఇప్పటికీ ఏనుగులు విధ్వంసాన్ని సృష్టి స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏనుగుల సంచారం, వాటి కదలి కపై ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగిం చుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల సమీపంలోని ఏనుగులు సమీపిస్తున్న సమయంలో ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ అలర్ట్ మెసేజ్‌లు పంపేందుకు ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోనున్నారు.