మెగా ఆక్షన్‌తో మారనున్న ఐపీఎల్ రూపురేఖలు
posted on Dec 11, 2025 7:07AM
.webp)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2026 మెగా ఆక్షన్ వచ్చే వారమే మొదలు కానుంది. ఈసారి ఏ ప్లేయర్, ఏ టీమ్‌లోకి వెళతాడు, ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయ్? ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకుంటాయ్? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే.. అంతకంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఈసారి కొత్త జట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయ్. పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్. ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందే.. ఈ నెలలో మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. 350 మంది ప్లేయర్లు.. వేలంలోకి రానున్నారు. ఇప్పటికే.. ఆక్షన్ కోసం నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి బీసీసీఐ.. ఎవరూ ఊహించని విధంగా 1005 మంది పేర్లను తొలగించింది. అదేవిధంగా.. 35 మంది కొత్త ప్లేయర్ల పేర్లను వేలంలోకి చేర్చింది.
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్.. డిసెంబర్ 16న.. అబుదాబీలో జరుగుతుంది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు బీసీసీఐ మెయిల్స్ కూడా పంపింది. బిడ్డింగ్ ప్రాసెస్.. బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా.. క్యాప్డ్ ప్లేయర్లతో మొదలవుతుంది. తర్వాత.. అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలం మొదలవుతుంది. ఈ 350 మంది ప్లేయర్లలో.. ఎవరు ఏ టీమ్‌లోకి వెళ్తారు.. ఏ జట్టు నుంచి.. ఏ ఫ్రాంచైజీకి షిప్ట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అమ్మకానికి పెట్టిన న్యూస్ క్రికెట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీమ్స్‌ని దక్కించుకునేందుకు.. నలుగురైదుగురు బయ్యర్లు రేసులో ఉన్నారు. వారిలో.. ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది. పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికా సహా.. కొత్త ఓనర్లు ఎక్కడి నుంచి వస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం.. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి.. ఫ్రాంచైజీలో 65 శాతం వాటా ఉంది. దాంతో.. రాజస్థాన్ రాయల్స్ మెజారిటీ వాటా అమ్మాలని చూస్తోంది. తమ టీమ్ విలువ.. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్.. తమ టీమ్‌లో వాటా అమ్మడానికి ప్రధాన కారణం.. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ విపరీతంగా పెరగడమే. ఈ అధిక విలువని నగదు రూపంలోకి మార్చుకోవాలని.. ఇప్పుడున్న ఓనర్లు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బదాలే నేతృత్వంలోని ఓనర్లంతా.. తమ మెజారిటీ వాటాని లేదా, పూర్తిగా ఫ్రాంచైజీని అమ్మడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గేమింగ్ దిగ్గజం క్రాఫ్టన్ ఇండియా, అదానీ గ్రూప్ లాంటి పెద్ద కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఇటీవలే.. ఆర్సీబీ ఓనర్ అయిన డియాజియో కంపెనీ కూడా.. ఫ్రాంచైజీ సేల్ ప్రాసెస్‌ని మొదలుపెట్టింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆ సంస్థ తెలిపింది.
అయితే.. లేటెస్ట్ డేటా ప్రకారం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఈ ఏడాది 20 శాతం తగ్గింది. గత ఏడాది 12 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ వాల్యూ.. ఇప్పుడు 9.6 బిలియన్లకు చేరింది. దేశంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మెగా వేలం చుట్టూ ఉన్న అనిశ్చితుల కారణంగానే.. ఐపీఎల్ విలువ తగ్గిందన్న చర్చ జరుగుతోంది. భారత్-పాక్ వివాదం, భద్రతా సమస్యల కారణంగా.. ఈ ఏడాది వారం పాటు ఐపీఎల్‌ని నిలిపేయాల్సి వచ్చింది. కోవిడ్ మహమ్మారి బారిన పడిన 2020 సీజన్ కాకుండా.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ భారీగా పడిపోయిన ఏకైక సంవత్సరం ఇదే. ఇప్పటికే.. లీగా వాల్యుయేషన్‌లో.. రెండేళ్లు క్షీణించింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. 2023లో.. ఐపీఎల్ వాల్యూ 92 వేల 500 కోట్లుగా ఉంది. అదే.. 2024కి వచ్చేసరికి.. 82 వేల 700 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది.. ఐపీఎల్ వాల్యూ మరింత పడిపోయింది. ఇప్పుడు.. ఐపీఎల్ విలువ కేవలం 76 వేల 100 కోట్లుగా ఉంది.
రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్లే.. ఐపీఎల్ గ్రోత్ తగ్గడానికి కారణమంటున్నారు. ఒక్క.. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ మాత్రమే పెరిగింది. ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా.. 108 మిలియన్ డాలర్లతో తమ స్థానాన్ని నిలుపుకుంది. అయినప్పటికీ.. ఎంఐ టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా 9 శాతం తగ్గింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్‌లో తమ తొలి టైటిల్ సాధించినప్పటికీ.. 10 శాతం వాల్యూ తగ్గిపోయింది. ప్రస్తుతం.. 105 మిలియన్ డాలర్ల వాల్యూతో.. రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ కూడా 24 శాతం తగ్గి.. 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 33% తగ్గి 73 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది.. ఎంతో కొంత వృద్ధిని నమోదు చేసిన ఏకైక ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ మాత్రమే. ఆ టీమ్ బ్రాండ్ విలువ 2% పెరిగి 70 మిలియన్ డాలర్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ 3 శాతం, లక్నో టీమ్ 2 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ 26 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 శాతం, రాజస్థాన్ రాయల్స్ వాల్యుయేషన్ 35శాతం పడిపోయాయి.