మహిళలకు రేవంతన్న కానుక రెండు చీరలు.. ఎప్పుడంటే?
posted on Sep 8, 2025 12:19PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుక అందించనున్నారు. స్వయం సేవక సంఘాల మహిళలకు ఈ కానుక అందించనున్నారు. బతుకమ్మ పండుగకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 'అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక' పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలోని సభ్యుల వివరాలు, డీఆర్డీవో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతాల్లోని సభ్యుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నాటికి ఈ చీరలు ఆయా జిల్లాల కేంద్రాలకు చేరనున్నాయి.