నన్నే మోసం చేసింది!.. భార్య రేణుకపై ఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఆరోపణ

 

కట్టుకున్న భార్యే తనను మోసం చేసిందనీ, అంతే కాకుండా తనపై హత్యాయత్నానికి ఒడికట్టందనీ ఒక ఐఎఫ్ఎస్ అధికారి వాపోతున్నారు. వివరాల్లోకి వెడితే.. ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులరెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన భార్య రేణుకపై ఆరోపణలు గుప్పించారు. మరొకరితో సన్నిహితంగా ఉండటమే కాకుండా, డబ్బుపై ఆశతో తనను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో తనపై హత్యాయత్నం చేసిందని ఆరోపించారు.  తన భార్య రేణకతో  వివాదం, ఆమె తనను హత్య చేసేందుకు పన్నిన పన్నాగం, మరొకరితో సన్నిహితంగా ఉన్న వైనాన్ని శ్రీనివాసులు రెడ్డి  వివరించారు. పాక్షిక అంధుడినని చెప్పిన ఆయన తాను రేణుకను వివాహం చేసుకున్నాననీ, తమకు ఇద్దరు పిల్లలనీ తెలిపారు. వృత్తిరీత్యా  తాను సుదూర ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చేదన్నారు.

ఈ క్రమంలో తన భార్య రేణుక మరోకరితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అందుకు సంబంధించి ఫోన్ రికార్డులు, ఫోన్ పే లు చేసిన ఆధారాలు, అదేవిధంగా మరొకరితో సన్నితంగా ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసినవారు తనకు చెప్పడంతో  చాలా ఆవేదన చెందానని చెప్పిన శ్రీనివాసులు రెడ్డి..  ఈ విషయంలో ఏర్పడిన వివాదానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందన్నారు.  ఈ క్రమంలో రేణుక  మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై మీడియాకు లేనిపోనివన్నీ చెప్పారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు.  కోర్టులో కేస్ నడుస్తుండగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఆమె మాటలను ఖండిస్తూ వాస్తవాలను తెలియజేసేందుకే తాను ఇప్పుడు మాట్లాడుతున్నానన్న శ్రీనివాసులు రెడ్డి తన స్వఅర్జితమైన నివాసంలోనే ఉంటూ తన భార్య తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందంటూ సాక్షాదారాలతో మీడియాకు చెప్పారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న తనను అవమానపరిచే విధంగా మాట్లాడిన రేణుకపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇదిలా ఉంటే శ్రీనివాసులు రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఆధ్యాంతం అతన్ని మాట్లాడనీయకుండా రేణుక అడ్డుకోవడం ఇబ్బందికరంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu