రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

 

 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమె అధికారిక నివాసంలో రాష్ట్రపతితో ప్రధాని సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్యాన్స్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. అధ్యక్షుడు మాక్రాన్‌ తో ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడాడు. 

అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. అధ్యక్షుడు మాక్రాన్‌‌తో చాలా మంచి సంభాషణ జరిగింది. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని మేము సమీక్షించాము మరియు సానుకూలంగా అంచనా వేసామని పేర్కొన్నారు.  ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించే ప్రయత్నాలు సహా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాము. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది." అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu