సీపీ సుధీర్ బాబుపై ప్రశంసలు వెల్లువ
posted on Sep 6, 2025 8:58PM

కఠినంగా కనిపించే కాకి యూనిఫామ్ వెనుక మనసున్న మానవత్వం కూడా ఉంటుందని నిరూపించారు కమిషనర్... అవునండి ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉండే ఓ కమిషనర్ రోడ్డుపై గాయాలు పడి ఉన్న దంపతులను చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి వారికి సేవలు చేసిన ఘటన మన హైదరాబాదు నగరంలో జరిగింది.
ఒకవైపు గణనాథుడి మహా నిమజ్జనోత్సవం పనుల్లో ఊపిరి సలపని బిజీ లో ఉన్నప్పటికీ కూడా గాయపడిన వారికి చికిత్స అందేలా ప్రత్యేక చొరవ చూపారు ఆ కమిషనర్... ఇంతకు ఆ కమిషనర్ ఇవ్వరా అని ఆలోచిస్తున్నారా అదేనండి మన రాచకొండ సిపి సుధీర్ బాబు....ఈరోజు ఉదయం బాలాపూర్ గణేషు డిని దర్శించుకోవ డానికి ఒక జంట టూ వీలర్ మీద వెళ్తున్న క్రమంలో వాహనం ఒక్కసారి గా అదుపుతప్పి కిందపడిపోయారు.
ఘటనలో వారికి గాయాలయ్యాయి. అదే సమయంలో అదే రోడ్డులో వెళ్తున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు వారిని గమనించి... వెంటనే వాహనాన్ని నిలిపివేసి సిబ్బంది చేత వారికి ప్రథమ చికిత్స చేయించారు. బిజీ సమయంలో కూడా స్వయంగా కమిషనర్ దగ్గరుండి వారికి ప్రథమ చికిత్స చేయించి క్షేమంగా వారు అక్కడినుండి వెళ్లేవరకు చొరవ చూపించడం చూసిన స్థానికులు కమిషనర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.