తెలంగాణలో రెండు టర్మ్‌లు నేనే సీఎం : రేవంత్ రెడ్డి

 

తెలంగాణలో రెండు టర్మ్‌లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి  సహకరించాలని ప్రధాని మోదీని కోరాని రేవంత్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అప్పటి ప్రధాని  మన్మోహన్ సింగ్ ఎలా సహకరించాడో ఇప్పుడూ అలాగే సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశాని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

నిన్నటి నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని   డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో  భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం అని చెప్పే ప్రయత్నం చేశాని రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వివాదాస్పదం చేస్తోందని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లు మూడు కోట్ల మంది ఉన్నారని… పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని తాను చెప్పానని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా హిందూ సమాజం లాంటిదేనని తాను వివరించానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu