రెండో వన్డేలోనూ కోహ్లీ సెంచరీ

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా రెండో మ్యాచ్ లోనూ మూడంకెల స్కోరు సాధించాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేసిన కోహ్లీ, ఇప్పుడు రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వన్డేల్లో కోహ్లీ చేసిన శతకాల సంఖ్య 53 కు చేరింది.

క్రికెట్ లోని ఏ ఫార్మాట్ లోనైనా సరే అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు కోహ్లీదే.  ఈ మ్యాచ్ లో కోహ్లీ 90 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకం బాదిన కోహ్లీ ఆ తరువాత 102 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్ లో మాక్రంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వన్డేలోలాగే ఈ మ్యాచ్ లోనూ కోహ్లీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు.   ఇదిలా ఉంటే.. వ‌రుస‌గా రెండు వ‌న్డే మ్యాచ్‌ల్లోనూ శ‌త‌కం చేయ‌డం కోహ్లీ కెరీర్‌లో ఇది 11వ సారి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu