పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కోతుల తిప్పలు

 

పల్లెలో  గ్రామ పంచాయితీ ఎన్నికల రగడ మొదలైంది.  గ్రామంలో ఉన్న కోతులను తరిమిన తర్వాతే ఓట్లు అడగాలని ఓటర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. కోతులు లేకుండా చేసిన అభ్యర్థికి ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.. దీనితో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోతుల బెడద సవాల్‌గా  మారుతుంది..జయశంకర్ భూపాలపల్లి జిల్లా..రేగొండ మండలం కేంద్రంలో మా ఓటు అమ్మేది లేదంటూ వేలిసిన వాల్ పోస్టర్లు....మండల కేంద్రానికి చెందిన మాడగాని నరేష్ అనే వ్యక్తి వాల్ పోస్టర్లు వేసి ఓట్ల అమ్ముకోము అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్‌గా  గెలిపిస్తామంటూ ఓటర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. తెలంగాణలో దాదాపు 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయంట. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడటంతో పాటు గుంపుగా దాడి చేయడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ అనేకం ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu