ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
posted on Oct 13, 2025 7:33PM

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్‌లో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించారు. అలాగే నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీని కలవడం చాలా గౌరవంగా ఉందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు.
ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు చెప్పాని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల విషయంలో ప్రధాని నాయకత్వాన్ని ప్రశంచాని సీఎ తెలిపారు. కర్నూల్ జరిగే సూపర్ జీఎస్టీ సేవింగ్స్ కార్యక్రమానికి ఆహ్వానించాని పేర్కొన్నారు. రేపు(మంగళవారం) గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు.