చర్లపల్లి జైలుకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్
posted on Oct 13, 2025 7:45PM
.webp)
కేంద్ర ఉప మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు చర్లపల్లి జైలును సందర్శించారు. సందర్శన సందర్భంగా డీజీపీ సౌమ్య మిశ్రా, జైలు శాఖ ఉన్నతాధికారులు మంత్రిని ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం మంత్రి జైలులో జరుగు తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి, వారు తయారు చేస్తున్న ఉత్పత్తు లను పరిశీలించారు. గోశాలలో పశువు లకు స్వయంగా మేత వేశారు.ఒక దూడకు “కృష్ణ” అని పేరు పెట్టారు. తరువాత జైలులో ఏర్పాటు చేసిన వినోద క్లబ్, చెమట గులాబీ తోటలను కూడా సందర్శిం చారు.
ఖైదీలు నిర్వహి స్తున్న తేనె ఉత్పత్తి విధానాన్ని కూడా గమనించారు. అధికారులు జైలు సంస్కరణలు, ఖైదీ సంక్షేమ కార్యక్రమా లపై పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ఇచ్చారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, మహిళా ఖైదీల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అందిస్తు న్నారని అధికారులు వివరించారు.చర్లపల్లి జైలు 25 ఏళ్ల క్రితం నిర్మించబ డిందని, అప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్టు తెలిపారు.ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ₹11.60 కోట్లు మంజూరు చేసిం దని, అందులో ₹11.30 కోట్లు వినియోగించబడినట్టు వివరించారు.
డీజీపీ సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జైలు శాఖలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అధికారులు చెప్పారు. ఖైదీల కుటుంబ సభ్యులు వీడియో లింక్ ద్వారా “ములా ఖాత్” చేసుకునే సౌకర్యం కల్పించా రని, ఖైదీలకు ఇన్సూరెన్స్ సదుపాయం అందించారని తెలిపారు. ఖైదీలకు విద్యా అవకాశాలు కల్పించి, కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీలు ప్రదానం చేస్తున్నారని చెప్పారు.
అంతే కాకుండా ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతిరోజూ సగటున 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహి స్తున్నారని, ప్రతి ఖైదీకి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అదనం గా ప్రతిరోజు యోగా, ధ్యానం, శారీరక వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్టు వివరించారు. జైలు నుండి విడుదలైన తర్వాత కొందరు ఖైదీలు పెట్రోల్ బంక్‌లలో పనిచేస్తూ కనీసం రూ.18,000 జీతం పొందుతు న్నారని తెలిపారు. అలాగే జైలు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, క్రీడా కార్యక్రమాల కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తెలంగాణ జైలు సిబ్బంది వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కూడా ఇస్తున్నారని, జైలు శాఖకు SKOCH అవార్డు లభించిందని పేర్కొన్నారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ... చర్లపల్లి జైలులో అమలు చేస్తున్న ఖైదీ సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఖైదీలకు బీమా సదుపాయం కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వంటి చర్యలు ఎంతో ప్రశంసనీయం అన్నారు. మహిళా ఖైదీల పిల్లల విద్యా ఫీజులు చెల్లించే నిర్ణయం జైలు శాఖ తీసుకోవడం ఒక మానవతా దృక్పథం అని అభినందించారు.
జైలు విభాగం డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా దూరదృష్టి ప్రశంసనీయమని, ఆమె కస్టడీ, కేర్, కరెక్షన్ అనే మూలసూత్రాలను కార్యరూపంలోకి తీసుకువచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్ గారు డీజీపీ సౌమ్య మిశ్రా యొక్క విజన్ మరియు చర్లపల్లి జైలును అభివృద్ధి చేసిన విధానాన్ని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల జైలు శాఖలు కూడా ఇక్కడి మాదిరి సంస్కరణలు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యమైనవని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం జైలు శాఖకు అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.