జోగి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ మద్యం...జనార్దన్‌రావు షాకింగ్ కామెంట్స్

 

నకిలీ మద్యం కేసులో అరెస్టైన ఏ-1 జనార్దన్ రావు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెంచడంతో నిలిపివేశామని కానీ ఏప్రిల్‌లో రమేష్ ఫోన్ చేసి మళ్లీ తయారు చేయాలన్నారని జనార్దన్ రావు పేర్కొన్నారు. కల్తీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేశ్‌ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుడు దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా కూటమి సర్కార్‌కి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు.' అని జనార్థన్ రావు ఇవాళ సంచలన విషయాలు బయటపెట్టారు.అంతేకాదు, 'తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. ఇబ్రహీంపట్నంలో కూడా సోదాలు చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని అన్నారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు, జగన్ మీడియా కూడా ముందే ఉంది. అనుకున్నది జరిగింది..

 ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. నువ్వు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని జోగి రమేష్ అన్నారు. అంతా చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడిని కూడా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇరికించాడు. జై చంద్రారెడ్డికి కల్తీ లిక్కర్‌తో అసలు సంబంధం లేదు'. అని జనార్దన్ రావు తెలిపారు జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేశ్‌ నమ్మించారు. రమేశ్‌తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నమ్మించి మోసం చేశారు. అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా’’ అని జనార్దన్‌రావు పేర్కొన్నాడు


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu