రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళ అధికారి

 

దేశంలో ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారట్లేదు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని  నార్సింగి మునిసిపల్ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక  రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. 

మరోవైపు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు పట్టుబడ్డాక ఆమె కన్నీరు పెట్టురు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సోదాలు నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu