ఏపీలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
posted on Sep 9, 2025 5:14PM

ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు చేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆమె పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో ఈవీఎంలు వాడారు. ఈవీఎంల కొనుగోలు,వినియోగంపై త్వరలో నిర్ణయం.’’ తీసుకుంటామని కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టింది.